మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలనిఉంది: నాగబాబు

మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలనిఉంది: నాగబాబు
x
Highlights

అమరావతిలో ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు దాడి చేస్తున్నారని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. గుడికి వెళ్తున్న మహిళల మీద లాఠీచార్జి చేస్తున్నారని అదే...

అమరావతిలో ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు దాడి చేస్తున్నారని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. గుడికి వెళ్తున్న మహిళల మీద లాఠీచార్జి చేస్తున్నారని అదే నిజమైతే అంతకన్నా దారుణం ఇంకోటి ఉండదని వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలందరికి రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా అంటూ నాగబాబు రైతులను ఉద్దేశించి ఆకాంక్షించారు.

అంతేకాదు రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూమ్స్ లలో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉందంటూ వెటకారం చేశారు. కులం ఎప్పుడు చెడ్డది కాదన్న నాగబాబు మలుషుల్లోనే చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారని.. ఇలా కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆదుకోవడం ఎవరికి మంచిదికాదని హితవు పలికారు. యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లేర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరని.. హిట్లర్ కూడా నాశనం అయిపోయాడు.. ఆ తప్పు చేయకండి జగన్ రెడ్డి గారు అని నాగబాబు అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories