Top
logo

వైసీపీలో ఛాన్స్ దొరుకుతుందా అని జనసేన నేత ఎదురుచూపు!

వైసీపీలో ఛాన్స్ దొరుకుతుందా అని జనసేన నేత ఎదురుచూపు!
Highlights

జనసేనలో ఆయన కీలకనేత, బీజేపీనుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. కానీ...

జనసేనలో ఆయన కీలకనేత, బీజేపీనుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఎంపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో జనసేనలో చేరారు. కానీ భవిశ్యత్ పై మాత్రం టెన్షన్ మొదలైందట.. ఇంతకీ ఆయన ఎవరా అని అనుకుంటున్నారా..? ఆయనే ఆకుల సత్యనారాయణ. 2014 ఎన్నికలో బీజేపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. అయితే టీడీపీ, బీజేపీ కలిసివున్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ స్నేహం చెడిందో అప్పుడే ఆయనకు టెన్షన్ మొదలయింది. బీజేపీనుంచి రాజమండ్రి ఎంపీ టిక్కెట్ ఆశించారు.. ఎటువంటి హామీ రాకపోవడంతో జనసేనలో చేరారు. ఆ పార్టీ నుంచి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.. కాలం కలిసిరాక ఓటమిపాలయ్యారు. దీంతో మళ్ళీ ఎన్నికల అనంతరం బీజేపీకి టచ్ లోకి వచ్చారట.

వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి ఎంపీ టిక్కెట్ పై హామీ ఇస్తే బీజేపీలో జాయిన్ అవుతానని షరతు విధించారట. కానీ బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదట.. ఈ క్రమంలో వైసీపీలో చేరడానికి ప్రయత్నాలు ప్రారంభించారట. అక్కడ ప్రస్తుతం నో వేకెన్సీ బోర్డు పెట్టారట. రాజమండ్రి నుంచి సిట్టింగ్ ఎంపీగా మార్గని భరత్ ఉన్నారు. ఆయన బీసీ వర్గానికి చెందిన నేత, పైగా ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడు. దీంతో వైసీపీలో చేరినా టిక్కెట్ హామీ ప్రశ్నార్థకమే అవుతుంది. ఈ క్రమంలో పార్టీ మారితే టిక్కెట్ వస్తుందా? ఎంపీ అవ్వాలన్న ఆయన కోరిక నెరవేరుతుందా అన్న సందేహం నెలకొంది.


లైవ్ టీవి


Share it
Top