చేనేత కార్మికులతో త్వరలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తా : పవన్ కళ్యాణ్

చేనేత కార్మికులతో త్వరలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తా : పవన్ కళ్యాణ్
x
Highlights

చేనేత కార్మికులకు శ్రమకు తగ్గిన ఫలితం దక్కడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి...

చేనేత కార్మికులకు శ్రమకు తగ్గిన ఫలితం దక్కడం లేదన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి నిర్వహించారు. కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వరకూ జనసేన పార్టీ మీ వెంటే ఉంటుందని అయన హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలపై త్వరలో రౌండ్ టేబుల్ ఏర్పాటు చేస్తానని, ఆ సమావేశంలో ఒక అవగాహనకు వచ్చిన తరవాత కేంద్ర ప్రభుత్వ దృష్టికి మీ సమస్యలు తీసుకెళ్తానని . చెప్పుకొచ్చారు .

అంతేకాకుండా చేనేత సమస్యలపై జేఏసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందరు రాజకీయ నేతల మాదిరిగా చప్పట్లు కొట్టించుకునేందుకు రాలేదని ప్రజా సమస్యల పరిష్కరం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో చేనేతను ఇష్టపడని వారు ఉండరు. అయినా మీ కష్టం తీరడం లేదు. దళారుల పాలవుతోంది. ఈ పరిస్థతిని చక్కదిద్దేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. మీకు అండగా ఉంటానని ని పవన్‌ కళ్యాణ్‌ హామీ ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories