logo

జనసేనలో పలు విభాగాలకు నియామకాలు..

జనసేనలో పలు విభాగాలకు నియామకాలు..
Highlights

జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పలు నియామకాలు...

జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో పలు నియామకాలు చేపట్టారు. ఇందులో భాగంగా పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీలో సుజాత పాండాను నియమించారు. పాలసీ వింగ్‌ చైర్మన్‌గా కంబాల యామినీ జ్యోత్స్నను నియమించారు. ఇక జనసేన 'వీర మహిళ' విభాగం అధ్యక్షురాలిగా జవ్వాజి రేఖను నియమించారు. ఆమె ప్రస్తుతం సీఏ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అలాగే ఈ కమిటీలో నలుగురు ఉపాధ్యక్షులను నియమించారు.

వారిలో షేక్‌ జరీనా (నరసరావుపేట), నూతాటి ప్రియా సౌజన్య (రాజమహేంద్రి), కనుమూరి కవిత సింధూరి (భీమవరం), జి. శ్రీవాణి (హైదరాబాద్‌) ఉన్నారు. అదేవిధంగా పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా వీరమహిళ కన్వీనర్లు, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లను కూడా నియమించారు. పార్టీ ప్రచార విభాగం చైర్మన్‌గా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పెద్దిశెట్టి ఉషశ్రీని పవన్ ఎంపిక చేశారు.


లైవ్ టీవి


Share it
Top