జనసేన విలీనంపై సంచలన విషయాన్నీ బయటపెట్టిన పవన్

జనసేన విలీనంపై సంచలన విషయాన్నీ బయటపెట్టిన పవన్
x
Highlights

జనసేన పార్టీని విలీనం చేస్తారంటూ కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అయితే ఇదే క్రమంలో జనసేన పార్టీని...

జనసేన పార్టీని విలీనం చేస్తారంటూ కొన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. అయితే ఇదే క్రమంలో జనసేన పార్టీని తమ పార్టీలో కలిపేయాలంటూ ఒక పెద్ద పార్టీ తనపై ఒత్తిడి తీసుకువస్తోందని సంచలన విషయం బయటపెట్టారు. అయితే, ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేనను విలీనం చేసేది లేదని స్పష్టం చేశారాయన. జనసేన కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలోని నేతలతో పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. జాతి సమగ్రతని కాపాడటానికి, మానవతా విలువల కోసం పెట్టిన పార్టీ జనసేన అని.. అందుకే జనసేనను ఏ పార్టీలోనూ కలపబోనని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే రోడ్ మీద, సోషల్ మీడియాలో చెప్తే వినటానికి ఇది కాంగ్రెస్ పార్టీ కాదని.. అన్న పవన్ అలాంటి విషయాలు తనతోనే నేరుగా చెప్పాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories