హస్తిన పర్యటకు బయల్దేరిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్

హస్తిన పర్యటకు బయల్దేరిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్
x

పవన్ కళ్యాణ్ ఫైల్ పోటో

Highlights

జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ హస్తినకు బయల్దేరారు.

జనసేన చీఫ్‌ పవన్‌కల్యాణ్‌ హస్తినకు బయల్దేరారు. బీజేపీ పెద్దలతో పవన్‌ భేటీకానున్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను పవన్‌ వ్యతిరేకించారు. స్టీల్‌ ప్లాంట్‌ కర్మాగారాన్ని కాపాడుకుంటామని ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం పూనుకోవడంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లా మంగళవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌కల్యాణ్ భేటీ కానున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేయనున్నారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నికల్లో లోక్ సభ అభ్యర్థిపై చర్చించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories