ఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన

Janasena Chief Pawan Kalyan will Tour Kadapa Today
x

ఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన

Highlights

Janasena: కౌలు రైతు‌ భరోసా యాత్రకు శ్రీకారం చుట్టిన పవన్

Janasena: ఈరోజు జనసేనాని పవన్ కల్యాణ్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో పవన్ భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్రలో భాగంగా పవ‎న్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలోని సిద్ధవటం గ్రామంలో రచ్చబండ పేరిట రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ రచ్చబండలోనే ఆయన పలువురు బాధిత రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున సహాయం అందించనున్నారు. అనంతరం జిల్లా పరిధిలో ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలు అన్నింటికీ పవన్ ఈ ఆర్థిక సాయాన్ని అందిస్తారు. పవన్ పర్యటన సందర్భంగా జనసేన నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories