మీ త్యాగాన్ని మరువలేం: పవన్ ట్వీట్

మీ త్యాగాన్ని మరువలేం: పవన్ ట్వీట్
x
Pawan Kalyan (File Photo)
Highlights

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగాలను మరువలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మద్య ఘర్షణ వాతావరణం ఉన్న...

దేశం కోసం ప్రాణాలు అర్పించిన మీ త్యాగాలను మరువలేమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. గత కొన్నాళ్లుగా రెండు దేశాల మద్య ఘర్షణ వాతావరణం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలో తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వవన్ ఈ ట్వీట్ చేశారు.

భారత్-చైనా సరిహద్దు ఘర్షణల్లో ముగ్గరు అమరులు కావడం కలవరపరచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ ముగ్గురు వీరులకి తన తరపున, జనసేన తరపున నివాళి ఘటిస్తున్నానన్నారు. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ ఉన్నారని తెలిసి బాధపడ్డానని చెప్పారు. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదన్నారు. ఆ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కల్నల్ సంతోష్ భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పవన్ వేడుకున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories