కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది : పవన్‌

కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది : పవన్‌
x
Pawan Kalyan (File Photo)
Highlights

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో ప్రపంచమంతా వణికిపోతుంటే.. ఇదో సాధారణ జ్వరంతో పోల్చి తేలిగ్గా మాట్లాడటం వల్లే నియంత్రణ చర్యల్లో అలసత్వం నెలకొంటోందని అన్నారు.

అనంతపురం జిల్లా పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో పవన్‌ మాట్లాడారు.. ఈ సందర్భంగాఇటీవల తాము పకడ్బందీ చర్యలు తీసుకోకపోతే ఏపీలోని కర్నూలు, గుంటూరుల్లా అయ్యేదని తెలంగాణకు చెందిన ఓ మంత్రి అన్నారని గుర్తుచేశారు.

దీన్నిబట్టే ఏపీలో పరిస్థితి అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఏపీని ఉదహరణగా చెప్పుకునే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. ఈ కరోనా విపత్తు నియంత్రణలో పాలనా విభాగం వైఫల్యానికి రాజకీయ నాయకత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇటీవలే సీఎం జగన్ కరోనా ఒక జ్వరం లాంటిదని భవిష్యత్తులో దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని ప్రజలకు ధైర్యం చెప్పే విధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories