Top
logo

ఎన్టీఆర్‌పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ఎన్టీఆర్‌పై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
X
Highlights

నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో...

నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎన్టీఆర్ చేసిన ఓ వ్యాఖను ప్రస్తావిస్తూ.. ఎన్టీఆర్‌లా తాను అహకారాన్ని తలకెక్కించుకోనని చెప్పారు. 'ఎన్టీఆర్‌గారు మెదక్ లో కుక్కను నిలబెట్టినా గెలుస్తుంది అని మాట్లాడారు, ఆ ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు, నా వెనుక లక్షలాది మంది జనసైనికులు ధవళేశ్వరం అయినా, అనంతపురంలో అయినా వచ్చారని నేను తలకి ఎక్కించుకోను' అని ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఇదిలావుంటే వామపక్షాలతో కలిసి రానున్న ఎన్నికలకు సిద్దమవుతున్న జనసేనాని అందుకు తగ్గట్టుగా ఆ పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న పవన్.. వామపక్షాలతో కలిసి మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఇటీవలే ప్రకటించారు.

Next Story