రాయలసీమ ముఖద్వారానికి చేరుకున్న పవన్ రైతు భరోసా యాత్ర...

Janasena Chief Pawan Kalyan Rythu Bharosa Yatra at Kurnool and Nandyal Today 08 05 2022 | Live News
x

రాయలసీమ ముఖద్వారానికి చేరుకున్న పవన్ రైతు భరోసా యాత్ర...

Highlights

Pawan Kalyan - Rythu Bharosa Yatra: నేడు కర్నూలు, నంద్యాల జిల్లాలో పవన్ పర్యటన...

Pawan Kalyan - Rythu Bharosa Yatra: సూసైడ్ చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు జనసేనాని చేస్తున్న రైతు భరోసా యాత్ర రాయలసీమ ముఖద్వారానికి చేరుకుంది. మొదటి దశలో 130 మంది కౌలు రైతు కుటుంబాలను పవన్ కలవనున్నారు. పవన్ పర్యటనను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.

ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు పవన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి ఆళ్లగడ్డ నియోజకవర్గంకు చేరుకుంటారు. అనంతరం శిరివెళ్ళ గ్రామంలో జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి హాజరవుతారు. మార్గమధ్యలో ఆత్మహత్యకు పాల్పడిన నాలుగు కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి చెక్కులు అందజేస్తారు.

మధ్యాహ్నం 2గం.30కి శిరివెళ్ళలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తారు. అనంతరం సభలో ప్రసంగించనున్నారు పవన్ కళ్యాణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 సంవత్సరాల్లో 400 మంది వరకు కౌలు రైతులు బలవంతపు మరణాలకు పాల్పడ్డారు. పంటలు పండక, పండినా ధర లేకపోవడంతో ఆర్థికంగా నలిగిపోయిన కౌలు రైతులు ఆత్మహత్యే శరణ్యమని భావిస్తున్నారు.

పంటల కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న కౌలురైతులకు అండగా నిలిచేందుకు కదిలిన జనసేనాని రాష్ట్రంలోని పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం చేస్తారు.

జనసేన అధినేత పర్యటనతో జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తన పదునైన మాటలతో ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధిస్తున్నారు పవన్. పవన్ కళ్యాణ్ పర్యటన కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories