రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

రైతు సౌభాగ్య దీక్షలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
x
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్
Highlights

రైతులు, నాయకులు సంఘీభావ దీక్షలు ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, వైఎస్ ఆర్ సర్కారు వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభమైంది.

కాకినాడ: రైతులు, నాయకులు సంఘీభావ దీక్షలు ధాన్యం రైతుల సమస్యలకు పరిష్కారం కోరుతూ, వైఎస్ ఆర్ సర్కారు వైఖరిపై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభమైంది. కాకినాడలోని జేఎన్టీయూ ఎదురుగా ఐ.టి.ఐ పక్కన ఏర్పాటు చేసిన దీక్ష శిబిరానికి ఉదయం 8 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మహిళలు హారతులు పట్టగా.. రైతులు పూల మాల వేసి ఆయనను వేదిక మీదకు ఆహ్వానించారు.

రైతు దీక్షకు సంకేతంగా రైతులు, పార్టీ నాయకులు పచ్చని కండువాను కప్పి, వరి కంకులు బహుకరించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనసైనికులు, నాయకులు, రైతులకు అభివాదం చేస్తూ పవన్ కళ్యాణ్ దీక్షకు కూర్చున్నారు. ఆయనతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు, తూర్పు గోదావరి జిల్లాతోపాటు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు, రైతు సంఘాల నేతలు వేదికపై దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మరో వైపు జనసేనాని దీక్షకు జన సైనికులు, రైతులు భారీగా తరలి వచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది జన సైనికులు కాకినాడ చేరుకొని నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.


HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories