ఈ నెల 17,18న జనసేన క్రియాశీలక సమావేశాలు

X
Highlights
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కీలక ముందడుగు వేశారు. ఈనెల 17,18 మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
admin15 Nov 2020 10:15 AM GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కీలక ముందడుగు వేశారు. ఈనెల 17,18 మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ క్రియాశీలక సమావేశాలు నిర్వహించనున్నారు. 17వ తేదీ ఉదయం 11 గంటలకు ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల సమీక్ష సమావేశం జరగనుండగా.. 18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పోరాట సమితి నేతలు, అమరావతికి చెందిన మహిళా రైతులతో జనసేనాని భేటీ కానున్నారు. మరోవైపు పార్టీ క్రియాశీలక సభ్యత్వం మరో 32 నియోజకవర్గాలలో ప్రారంభం కానుందిఈ కార్యక్రమానికి సంబంధించి 32 నియోజకవర్గాల ఇంచార్జిలతో బుధవారం ఉదయం 11 గంటలకు సమావేశం కానున్నారు. ఈ రెండు సమావేశాలలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారు.
Web Titlejanasena chief Pawan Kalyan Key meetings this months 17,18
Next Story