వచ్చే ఎన్నికల్లో పవన్ పోటి ఇక్కడినుంచే.. క్లారిటీ ఇచ్చిన జనసేనాని!

వచ్చే ఎన్నికల్లో పవన్ పోటి ఇక్కడినుంచే.. క్లారిటీ ఇచ్చిన జనసేనాని!
x
Highlights

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే.. కేవలం ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఓటమి పాలు అయిన సంగతి తెలిసిందే.. కేవలం ఆ పార్టీ ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. ఇక పవన్ పోటి చేసిన రెండు చోట్లల్లో (భీమవరం, గాజువాక) ఓడిపోయాడు. అయినప్పటికి ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నాడు పవన్.. ఇక గత అనుభవాల దృష్టితో మిషన్ 2024కు ఇప్పటి నుండే కసరత్తు మొదలుపెట్టాడు పవన్..

ఈ రోజు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన పవన్ స్థానిక సమస్యలపై చర్చించారు. ఈ నేపద్యంలో పవన్ కొన్ని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేయాలని తనకు ఆసక్తి లేదన్నారు. కానీ పార్టీ నేతలు ఆలోచన తోనే రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశానుని లేకపోతే తాడేపల్లిగూడెం నుంచే పోటీ చేయాల్సి ఉండేవాడినని, అక్కడైతే సులువుగా గెలవాల్సిన సీటన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తానని పవన్ అన్నారు.

తాడేపల్లి నియోజకవర్గంలో పార్టీ కేడర్‌‌ను అధికార పార్టీ వైసీపీ వేధిస్తోందని పవన్ కళ్యాణ్‌కు బొలిశెట్టి సత్య ఫిర్యాదు చేశారు. ఈ వేధింపులపై అవసరమైతే తానే తాడేపల్లిగూడెం వస్తానని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. స్థానికంగా భూముల్ని కొందరు కబ్జా చేస్తున్నారని పార్టీ నేతలు, కార్యకర్తలు జనసేనానికి ఫిర్యాదు చేశారు. దీనిపైన అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని, అందుకు సహకరించాలని పవన్ చెప్పారు.

ఇక తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికలపైన జనసేనాని ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు. డబ్బులు లేకుండా రాజకీయాల్లో గెలుస్తారనడానికి చెప్పాడానికి ఢిల్లీ ఎన్నికలే చక్కటి ఉదాహరణ అని పవన్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో డబ్బులిచ్చి గెలవలేదని, ఐడియాలజీతో గెలిచారని పవన్ అన్నారు. ఇక తానూ బతకడానికి మాత్రమే సినిమాలు చేస్తున్నాని పవన్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories