pavan kalyan fire on cm jagan: కాపు రిజర్వేషన్ ద్రుష్టి మరల్చడానికే ఈ ఎత్తుగడ : పవన్ కళ్యాణ్

pavan kalyan fire on cm jagan: కాపు రిజర్వేషన్ ద్రుష్టి మరల్చడానికే ఈ ఎత్తుగడ : పవన్ కళ్యాణ్
x
Highlights

pavan kalyan fire on cm jagan: కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై దృష్టి మరల్చడానికే పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేశారన్నారు.

pavan kalyan fire on cm jagan: కాపు నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాపు నేస్తం పథకంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లపై దృష్టి మరల్చడానికే పాలకులు తెలివిగా కాపు కార్పొరేషన్‌ ను ఏర్పాటు చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం 'గాలికి పోయే పేలాల పిండి కృష్ణార్పణం' అన్నరీతిలో ఏ పథకం కింద లబ్ది చేకూర్చినా అది కాపులను ప్రత్యేకంగా ఉద్దరించడానికేనని గొప్పలు చెబుతోందని విమర్శించారు.

గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ కు ఏటా రూ. 1000 కోట్లు కేటాయిస్తామని ప్రకటించగా ప్రస్తుత పాలకులు ఏటా రూ.2వేల కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికారని.. కానీ ఇప్పుడు ఇచ్చిందెంత? అని ప్రశ్నించారు. ఈ విషయంలో అడిగిన వారికి కాకి లెక్కలు చెబుతున్నారని అన్నారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్..

గత 13 నెలల కాలంగా 23 లక్షల మంది కాపుల కోసం రూ. 4770 కోట్లను ఖర్చు చేశామని చెబుతున్నారు. ఈ నిధులను రాష్ట్రంలో ప్రజల అందరితోపాటు కలిపి ఇచ్చారా? లేదా కాపులకు మాత్రమే ఇచ్చారా? అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటించడం లేదని అన్నారు. రిజర్వేషన్‌ గురించి కాపులు డిమాండ్‌ చేయకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడగా జనసేన భావిస్తోందని అన్నారు. అసలు కాపు కార్పొరేషన్‌ కు ఇప్పటి వరకు ఏ బడ్జెట్లో ఎంతకేటాయిందారు? ఎంత ఖర్చు చేశారో శ్వేత పత్రాన్ని ప్రకటించాలని జనసేన డిమాండ్‌ చేస్తోందని పేర్కొన్నారు. కాపు నేస్తం పథకానికి అర్హులుగా కేవలం 2.35 లక్షలు మందిని మాత్రమే గుర్తించడంలో పలు సందేహాలు కలుగుతున్నాయని అన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories