కోవిడ్ సాధారణ జ్వరమా..?అధ్యయనాలేం చెబుతున్నాయంటే: జనసేనాని

కోవిడ్ సాధారణ జ్వరమా..?అధ్యయనాలేం చెబుతున్నాయంటే: జనసేనాని
x
Pawan Kalyan (File Photo)
Highlights

కరోనా వైరస్ కేవలం జ్వరం లాంటిదే అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి.

కరోనా వైరస్ కేవలం జ్వరం లాంటిదే అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. కరోనా కట్టడిపై జగన్ చేతులెత్తేశారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. 'అందరు అనుకున్నట్లు కోవిడ్ 19 (కరోనా వైరస్) సాధారణ జ్వరం కాదు. దీని వల్ల ఊరిపితిత్తులపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతుందని చైనాకు చెందిన పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని గురించి 'సైన్స్ న్యూస్' లో వచ్చిన కథనం చదవండి' అని ట్వీట్ చేశారు. 'సైన్స్ న్యూస్' సంస్థ ఇచ్చిన కేస్ స్టడీని ఉదహరించారు. దీనిపై చంద్రబాబు కూడా సీఎం నిర్లక్ష్యానికి నిదర్శమని ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే, ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని తెలుస్తోందని చంద్రబాబు ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం జగన్.. కరోనా బాధితులను అంటరానివారిగా చూడొద్దని సీఎం జగన్ అన్నారు. కరోనా నాతో సహా ఎవరికైనా రావచ్చుని, రాబోయే కాలంలో ప్రజలు కరోనా కలిసి జీవించాల్సి ఉంటుంది. ప్రజలు వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని కోరారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, కరోనాపై అనవసర భయాలు పెట్టుకోవద్దు అన్నారు. కరోనా ఒక జ్వరం లాంటిది అన్నారు. ఎవరికి వస్తుందో తెలియడం కష్టమన్నారు. సామాజిక దూరం పాటించడం అవసరం. రాష్ట్రంలోని గ్రీన్ జోన్స్ ప్రాంతాలలో కరోనా రాకుండా జాగ్రత్త పడాల్సి అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు చేశారు.

ఏపీలో కరోనా వైరస్ ఉద్ధృతి రోజు రోజుకి పెరుగుతుంది. ఇవాళ ఒక్కరోజు 82 కొత్తపాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,259కి చేరింది. వీటిలో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే వెలుగు చూడడం పట్టణ వాసులను ఆందోళనకు గురిచేస్తోంది. తాజగా నమోదైన కేసుల్లో 40 కేసులు కర్నూలులోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో మొత్తం 332 కేసులతో జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.


Show Full Article
Print Article
Next Story
More Stories