ఫిబ్రవరి 2న జనసేన -బీజేపీ కవాతు.. కలిసి పోరాటం చేస్తాం

ఫిబ్రవరి 2న జనసేన -బీజేపీ కవాతు.. కలిసి పోరాటం చేస్తాం
x
Janasena Chief Pavan Kalyan (File Photo)
Highlights

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనసేన -బీజేపీ కూటమి తన పోరాటాన్ని మొదలు పెట్టనుంది. అమరావతి తరలించ్చొదని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న విజయవాడలో కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.

ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా జనసేన -బీజేపీ కూటమి తన పోరాటాన్ని మొదలు పెట్టనుంది. అమరావతి తరలించ్చొదని రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 2న విజయవాడలో కవాతు నిర్వహించాలని నిర్ణయించారు.ఢిల్లీలో సమన్వయ కమిటీ భేటీలో పలు అంశాలను మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో ఏపీలో చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై జనసేన అధినేత పవన్ కళ్యాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా చర్చించారు. ఈ సమావేశంలో పురంధేశ్వరి, ఎంపీ జీవీఏల్ నరసింహారావు, జనసేన నేత నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు.

జనవరి 28న మరోసారి జనసేన - బీజేపీ సమావేశం ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజల తరపున ఏ పోరాటం చేసిన జనసేన, బీజేపీ కలిసి చేస్తాయని తెలిపారు. రాజధాని రైతులకు మద్దతుగా వచ్చే నెల 2న తాడేపల్లి నుంచి విజయవాడలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు లాంగ్ మార్చి నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి 15 రోజులకు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.

బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కలిసి రాష్ట్రంలో ప్రస్తుత నెలకొన్న పరిస్థితులు వివరించారు. అనంతరం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తామని తెలిపారు. జనసేన పార్టీ విలీనంపై వస్తున్న వార్తలను పవన్ కళ్యాన్ ఖండించారు. జనసేన విలీనం చేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. విశాఖలో రిపబ్లిక్ డే నిర్వహించాలని ఖర్చు చేసి వెనక్కి తగ్గారని విమర్శించారు. మూడు రాజధానులకు కేంద్ర ఒప్పుకుందని వైసీపీ తప్పుడు ప్రచారం చేసే అవకాశం ఉందన్నారు. మూడు రాజధానులకు కేంద్రం సమ్మతి లేదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే దానిని కేంద్రం చేస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తో సుమారు గంటపైగా సమావేశ అయ్యారు. ఏపీ కేంద్రం భారీ ఎత్తున నిధులు అందిస్తున్నా టీడీపీ, వైసీపీ ప్రభుత్వం కూడా యుటిలిటీ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి వారితో అన్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories