ఈ నెల 5న జనసేన , బీజేపీ రామతీర్ధ ధర్మ యాత్ర

ఈ నెల 5న జనసేన ,  బీజేపీ రామతీర్ధ ధర్మ యాత్ర
x
Highlights

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటన ప్రకంపనలు సృష్ఠిస్తోంది.

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటన ప్రకంపనలు సృష్ఠిస్తోంది. దుండగులను పట్టుకోవాలని ప్రతిపక్షలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల ఐదో తేదినా జనసేన, బీజేపీ అధ్వర్యంలో రామతీర్ధ ధర్మ యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు జనసేన తన అధికారిగా ట్వీట్టర్ లో తెలిపింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరికి నిరసనగా జనవరి 5వ తేదీ ఉ 11గం.లకు రామతీర్ధ ధర్మ యాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించింది.

కోదండరాముని దేవాలయం వద్ద గత వారం రోజులుగా నిరసన చేస్తున్నబీజేపీ నాయకులను అరెస్టు చేయడం అన్యాయమని ఆ పార్టీ ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. రామతీర్థంలో కోదండరాముని ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాధవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5న భారతీయ జనతా పార్టీ, జనసేన భాగస్వామ్యంతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు.

రామతీర్థంలో కోదండరాముని ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఘటన తెలిసిందే. పోలీసులు ధ్వంసమైన శిరస్సును పక్కనే ఉన్న కోనేరులో కనుగొని ఆలయానికి అప్పగించారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అదే సమయంలో ఆలయంలో సంభవించిన దుర్ఘటన రాజకీయ బలప్రదర్శనకు దారి తీసింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ సీనియర్‌ నేత విజయసాయిరెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌ ఒకేరోజు ఆయా పార్టీల కార్యకర్తలతో అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్తితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు బాగా శ్రమించాల్సి వచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories