Pawan Kalyan: పేరు మార్చి సాధించేది ఏమిటి..?

Pawan Kalyan: ఎన్టీఆర్‌ పేరు బదులుగా.. వైఎస్సార్ అని పెడితే.. విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోతాయా..?

Rama Rao
Published on: 21 Sept 2022 7:00 PM IST
Jana Sena Chief Pawan Kalyan said the government is trying to create controversies
X

Pawan Kalyan: పేరు మార్చి సాధించేది ఏమిటి..?

Pawan Kalyan: పేరు మార్చి సాధించేది ఏమిటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఎన్టీఆర్ పేరు మార్పు చేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో రాష్ట్ర పాలకులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. ఎన్టీఆర్‌ పేరు బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోతాయా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవన్నది వాస్తవమన్న పవన్‌కల్యాణ్ ఇంట్లో వారి పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టేముందు ప్రజల కోసం జీవితాలను ధారబోసిన మహానీయుల గురించి తెలుసుకోవాలని సూచించారు.

Rama Rao

Rama Rao

Next Story