logo

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రామసుబ్బారెడ్డి

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన రామసుబ్బారెడ్డి

కడప జిల్లా జమ్మలమడుగు టీడీపీ పంచాయితీ సుఖాంతమైంది. వచ్చే ఎన్నికల్లో రామసుబారెడ్డి పోటీ చేస్తారని జిల్లా నేతలకు సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. ఇక ఎమ్మెల్యే సీటు కన్ఫామ్ కావడంతో.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు రామసుబ్బారెడ్డి. తన రాజీనామా లేఖను సీఎంకు ఇచ్చారు. దీంతో కడప ఎంపీగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. అలాగే ఆదినారాయణరెడ్డి కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపినట్టు సమాచారం.

ఇదిలావుంటే ఇద్దరిలో ఎవరైతే కడప ఎంపీగా పోటీ చేస్తారో వాళ్లకే ప్రత్మామ్నాయంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎంపీగా పోటీ చేస్తారని, ఎమ్మెల్సీ పదవి వద్దు అనుకున్న వారు జమ్మలమడుగు నుంచి ఎమ్మల్యేగా పోటీ చేయాల్సి ఉంటుందని వారికి చెప్పారు సీఎం చంద్రబాబు.

లైవ్ టీవి

Share it
Top