అమ్మఒడి పథకం: కావాల్సిన పత్రాలివే.. సంక్రాంతి తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు

అమ్మఒడి పథకం: కావాల్సిన పత్రాలివే.. సంక్రాంతి తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు
x
Jagan Amma Vodi Scheme File Photo
Highlights

ఆంధ్రప్రదేశ్‌ జగన్నన్న అమ్మఒడి పధకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పధకానికి చెందిన లబ్ధిదారులై ఉండి సరైనా పత్రాలు సమర్పించని వారికి మరో అవకాశం ప్రభుత్వం కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకం. సీఎం చిత్తూరు జిల్లాలో అమ్మఒడి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పేదింటి తల్లులు, పిల్లలకు ఆర్థికంగా అండగానే ఉండేదుకు 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని తీసుకొచ్చామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద 42,12,185 లక్షల మంది తల్లులకు, 81,72,222 లక్షల పిల్లలకు మేలు చేయకురనుంది. ప్రభుత్వం విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి నిబంధనలు మొదటి సంవత్సరానికి తొలిగించింది. ఇది కాస్త ఉపశమనం కలిగించే అంశమే.

మొదట ఈ పథకానికి 81,72,222 లక్షల పిల్లలను మంది అర్హులని గుర్తిచింది. ఈ పథకానికి ప్రభుత్వం రూ.6,456 కోట్లు కేటాయించింది. అయితే పూర్తి స్థాయి వివరాలు లేక వివిధ కారణాలతో కొందమంది అనర్హుల జాబితాలో చేరారు. అమ్మఒడికి అర్హులై ఉండి నగదు రాని వారు సంక్రాంతి తర్వాత దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ పథకం వర్తించాలంటే ప్రభుత్వం పలు నిలబంధనలు విధించింది. ప్రభుత్వం చెప్పిన పత్రాలను సమర్పిస్తేనే అర్హులు అని తెలిపింది. అయితే వారు సమర్ఫించాల్సిన పత్రాలు కూడా తెలిపింది. వాటి వివరాలు చూసినట్లయితే..

1. రేషన్ కార్డు లేదు: అమ్మఒడి లబ్ధిదారులు రేషన్ కార్డు లేకపోయినా పథకానికి అర్హులే, అని ఆ గ్రామ వీఆర్ఓ చేత ధృవీకరించిన లేఖను జత చేయవలెను.

2. విద్యార్ధికి ఆధార్ లేదు: విద్యార్ధికి ఆధార్ కార్డు లేకపోతే, విద్యార్థి తల్లి కుమారుడు లేదా కుమార్తెకు ఆధార్ లేదు అని స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.

3. కరెంట్ బిల్లు: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి

A) సర్వీస్ నంబర్ వారికి సంబందించినదే కాదు: సర్వీస్ నంబర్ వారి కుటుంబానికి చెందినది కాదు అని (ఏ.ఈ ) ధృవీకరించిన లేఖను జత చేయాలి.

B) సర్వీస్ వారికి సంబందించినదే కానీ కరెంట్ వాడకం లేదు:

ఏ సర్వీస్ నంబర్‌తో కలదో దానికి చెందిన చివరి 6 నెలల విద్యుత్ బిల్లుల నకలు కాపీలు లేదా కరెంట్ (ఏ.ఈ) సంతకం గల లెటర్ జత చేయాలి.

4. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్: లబ్ధిదారులు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ లేరని స్వీయ ధృవీకరణ పత్రం జతచేయవలెను.

5. కారు : జాబితాలో చూపించిన నంబర్ గల వాహనము(కారు) వీరిది కాదు అని సంబంధిత అధికారి (ఆర్.టి.ఓ లేదా మోటార్ వెహికల్ అధికారి) ధృవీకరణ పత్రంతోపాటు స్వీయ ధృవీకరణ పత్రం జతచేయాలి.

6. వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నది:

లభ్ధిదారు కుటుంబానికి పంట విస్తిర్ణము పత్రాలు సమర్పించాలి. పొలం ఎంత ఉంది అనే సంబంధిత వీ.ఆర్.ఓ సర్టిఫై చేసి లేఖ, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము జిరాక్స్ లు (భూమి ఉన్నవారికి మాత్రమే), కుటుంబంలో వారికి ఈ గ్రామాలలో భూమీ ఉందో కూడా రాయాలి. ఇతర గ్రామాల్లో గానీ మరెక్కడా భూములు లేవని స్వీయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories