'జగనన్న విద్యాకానుక'కు ముహూర్తం ఖరారు

జగనన్న విద్యాకానుకకు ముహూర్తం ఖరారు
x
Highlights

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 5న (ఈరోజు) ప్రారంభం..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం 'జగనన్న విద్యాకానుక' పథకాన్ని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 5న (ఈరోజు) ప్రారంభం కావల్సి ఉన్న జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. అయితే వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని ఈనెల 8న ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభం అవుతుంది. ఈ

పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 42.34 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని, సుమారు రూ.650 కోట్ల విలువైన కిట్లను విద్యార్థులకు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 3 జతల బట్టలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, స్కూల్‌బ్యాగ్‌ ను అందిస్తారు. మరోవైపు ఏపీలో విద్యాశాఖ ఉన్నతాధికారులు జగనన్న విద్యాకానుక కిట్‌లను ప్రధానోపాధ్యాయులకు అందజేస్తున్నారు. వారు తీసుకుని వెళ్లి స్కూళ్లలో ఉంచుతున్నారు. అనంతరం వీటిని 8వ తేదీన పంపిణి చేస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories