Andhra Pradesh: నేడు జగనన్న విద్యా దీవెన మొదటి విడత కార్యక్రమం

Jagananna Vidya Deevena Scheme First Phase Starts Today
x

జగనన్న విద్య దీవెన (ఫైల్ ఇమేజ్)

Highlights

Andhra Pradesh: సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రారంభించనున్న జగన్ * విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమకానున్న డబ్బు

Andhra Pradesh: నేడు ఎపీలో జగనన్న విద్యా దీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ప్రారంబించనున్నారు సీఎం జగన్. సీఎం క్యాంప్ ఆఫీసులో కంప్యూటర్ బటన్ నొక్కి తొలివిడత జగనన్న విద్యా దీవేనను ప్రారంభిస్తారు. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమకానుంది. 2020 - 2021 విద్యా సంత్సరానికి జగనన్న విద్యా దీవెన ద్వారా 10లక్షల 88వేల 439 మందికి లబ్ధి కలగనుంది. మొదటి విడతగా 671 కోట్ల 45 లక్షలను.. వీరి ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం. జూలైలో రెండో విడత, డిసెంబర్ లో మూడో విడత, 2022 ఫిబ్రవరిలో నాలుగో విడత జగనన్న విద్యా దీవెనను నిర్వహించనున్నారు.

పేద విద్యార్థుల్ని కూడా పెద్ద చదువులు చదివించాలన్న లక్ష్యంతో సీఎం జగన్‌ చేపట్టిన జగనన్న విద్యాదీవెన పథకం కింద.. 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అందించనుంది. పలు విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్‌ ఇవాళ తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories