తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : వైయస్ జగన్

తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం :  వైయస్ జగన్
x
Highlights

తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం...

తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని వైసీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు. తిత్లీ తుపాను కారణంగా జిల్లాలో రూ.3450కోట్ల మేర నష్టం జరిగిందని కేంద్రానికి లేఖ రాసి, కేవలం 500 కోట్లు మాత్రమే బాధితులకు చెల్లించారని అన్నారు. తుఫాను కారణంగా నష్టపోయిన వారికి ఇప్పటికి డబ్బులు అందలేదని అన్నారు.

తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం : వైయస్ జగన్పలాస, ఇచ్చాపురం, టెక్కలి ప్రాతంలో కిడ్నీ బాధితులు ఉన్నారు. వారికోసం గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలుచేయలేదని మండిపడ్డారు. కిడ్నీ బాధితులకోసం డయాలసిస్‌ సెంటర్‌, కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పి టీడీపీ ప్రభుత్వం విస్మరించింది అన్నారు. తాము అధికారంలోకి రాగానే తుఫాను బాధితులను ఆదుకోవడం తోపాటు కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్‌ సెంటర్‌ను, కిడ్నీ రిసెర్చ్‌ హాస్పిటల్‌ను ఏర్పాటు చేస్తామని జగన్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories