Jagan: వైసీపీలో మహిళా సీట్లను పెంచే ఆలోచనలో జగన్

Jagan Is Thinking Of Increasing The Number Of Women Seats In YCP
x

Jagan: వైసీపీలో మహిళా సీట్లను పెంచే ఆలోచనలో జగన్

Highlights

Jagan: జగన్ ఆలోచనపై వైసీపీలో జరుగుతున్న చర్చ ఏంటి.?

Jagan: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇంఛార్జ్‌లను మార్చిన వైసీపీ అధిష్టానం.. తాజాగా మరో అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తుంది. అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉంటాయని.. ముందే చెప్పిన అధినాయకత్వం.. గెలుపే లక్ష్యంగా.. అధికారమే పరమావధిగా... వ్యూహాలు రచిస్తోంది. ఈసారి మహిళలకు ప్రాధాన్యత అంశంపై.. ఆపార్టీ అధ్యక్షుడు జగన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.

గతంలో 14 మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఈసారి మహిళలకు ప్రాధాన్యత అంశంలో అధిక సీట్లు కేటాయించేందుకు జగన్ ప్రణాళిక చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వైసీపీ అధిష్టానం.. ఈసారి మహిళా శాసన సభ అభ్యర్థుల సంఖ్యను పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు పార్టీలో మాట్లాడుకుంటున్నారు. దీనిని బట్టి... ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా సీట్లు రెట్టింపయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

175 స్థానాలకు ఇప్పటికే 14 మందిని ఎంపిక చేసిన జగన్.. మరికొన్ని స్థానాలను కూడా మహిళలకే కేటాయించేందుకు మొగ్గు చూపుతున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నారు. దీనిపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్‌లో జగన్ సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు ముఖ్య నాయకులతోపాటు సీనియర్లతోనూ.. ఈ అంశంపై చర్చించినట్టు పార్టీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. అధిష్టానం నిర్ణయానికి పలువురు అభ‌్యంతరం తెలిపినా..మెజారిటీ శాతం నాయకులు సానుకూలంగా ఉన్నట్టు శ్రేణులుల చర్చించుకుంటున్నారు.

మహిళలకు ప్రయారిటీపై జగన్ ఆలోచన ఏంటని...? మహిళా సీట్లకు ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రశ్నలు ఇప్పుడు వైసీపీలో తీవ్ర చర్చకు దారీ తీస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలో.. ఎక్కువ శాతం మందిపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందువల్లే.. స్థానాలు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. మహిళకు కేటాయిస్తే.. సామాజిక అంశాలతోపాటు.. ప్రజల మద్దతు కలిసొస్తుందని వైసీపీ అధినాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories