వారికోసం టిక్కెట్లు రిజర్వ్ చేసిన జగన్!

వారికోసం టిక్కెట్లు రిజర్వ్ చేసిన జగన్!
x
Highlights

సుదీర్ఘకాలం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రస్తుతం బస్సు యాత్రకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత వైయస్ జగన్. అయితే పాదయాత్ర ముగిసిన తరువాత...

సుదీర్ఘకాలం రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రస్తుతం బస్సు యాత్రకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత వైయస్ జగన్. అయితే పాదయాత్ర ముగిసిన తరువాత కుటుంబసభ్యులతో కలిసి లండన్ వెళ్లాలనుకున్నారు. కానీ అనూహ్యంగా లండన్ పర్యటనను రద్దు వేసుకున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించడం.. రానున్న ఎన్నికల్లో బరిలో దింపే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేయడంపై దృష్టి సారించారు. ఎన్నికల వేళ ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు ఉంటాయని భావిస్తున్న జగన్.. కలిసి వచ్చే బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు. వివిధ నియోజకవర్గాల నేతలతో హైదరాబాద్‌లో సమావేశాలు నిర్వహిస్తూ.. అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారు. ఇప్పటివరకు వందకు పైగానే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇబ్బందికరంగా ఉన్నచోట్ల షార్ట్ లిస్ట్ తయారు చేస్తున్నారు. ఎంపిక చేసిన వారితో విడివిడిగా భేటీ అవుతూ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. మరోవైపు టికెట్ లేని నేతలకు ఇప్పుడే క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అటువంటి నాయకులకు పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ, లేదా నామినేటెడ్ పదవులు ఇస్తానని హామీ ఇస్తున్నారు. టికెట్ దక్కలేదని కొందరు నేతలు రచ్చ చేసే ప్రమాదం ఉందని గ్రహిస్తున్న జగన్.. అలాంటి వారిని గుర్తించి ఇప్పటినుంచే బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 5 నుంచి 10 ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలను ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు రిజర్వ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అవి ఉత్తరాంధ్ర, గుంటూరు, ప్రకాశం జిల్లాల కీలక నాయకులకోసం హోల్డ్ చేసినట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories