ఒంగోలులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..

ఒంగోలులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష..
x
Highlights

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా.. జామియాట్ ఉలేమా - ఇ-హింద్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ ఒంగోల్‌లోని ఓల్డ్ మార్కెట్ వద్ద ఉన్న మౌలానా అబుల్...

సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా.. జామియాట్ ఉలేమా - ఇ-హింద్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ ఒంగోల్‌లోని ఓల్డ్ మార్కెట్ వద్ద ఉన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షను ప్రారంభించింది. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను రద్దు చేసి ముస్లిం ప్రజలకు న్యాయం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. వారికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ సంఘీభావం తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ సామరస్యాన్ని, సమగ్రతను కాపాడవలసిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తోందని.. తద్వారా దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దేశంలో మతం ఆధారిత రాజకీయాలతో బీజేపీ ప్రజలను బెదిరిస్తోందని, రాబోయే అసెంబ్లీ సమావేశంలో రాష్ట్రంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ అమలుకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఆయన. అలాగే సీపీఎం నాయకుడు జివి కొండారెడ్డి మాట్లాడుతూ..

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంకర రాజకీయాలపై దృష్టి సారించిందని విమర్శించారు. దేశ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని.. దీనిద్వారా ప్రజలు నష్టపోతున్నారని అన్నారు. ఈ దీక్షలో వైసీపీ కొండెపి ఇంచార్జి మాదాసి వెంకయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముస్లిం లకు సీఎం వైఎస్ జగన్ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. వామపక్ష నాయకులు సాగర్, షేక్ సుల్తానా, అతింటి శ్రీను తదితరులు దీక్షను సందర్శించారు. జెఎసి నేతలు జామియాట్ ఉలేమా-ఇ-హింద్ సయ్యద్ సర్దార్, మౌలానా రహీమ్ ఖాన్, మౌలానా అబిద్ నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలో ముస్లింలు పాల్గొన్నారు.

కాగా సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడుతున్నారు ముస్లింలు. శుక్రవారం సాయంత్రం మార్కాపురం లో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ముస్లిం ప్రజల హక్కులకు కట్టుబడి ఉందని చెప్పారు. అన్ని మతాలకు అన్ని వర్గాల వారికి అనుకూలంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories