జగన్, చంద్రబాబు వ్యూహాలపై ఐవైఆర్ కృష్ణారావు స్పందన

జగన్, చంద్రబాబు వ్యూహాలపై ఐవైఆర్ కృష్ణారావు స్పందన
x
జగన్మోహన్ రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావు, చంద్రబాబు నాయుడు
Highlights

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.

రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు. జగన్ లేవనెత్తిన మూడు రాజధానుల వ్యాఖ్యలపై కృష్ణారావు తన అభిప్రాయాలను తెలియజేశారు.

రాజధానికి కావాల్సిన భవనాలు మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయిలో వెయ్యి కోట్ల కన్నా తక్కువ వ్యయంతో నిర్మించవచ్చని అన్నారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టి అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్ తో సరిపెట్టవచ్చని చెప్పారు. ఇక కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చెయ్యాలన్న వాదన దీర్ఘకాలికంగా ఉందని అన్నారు. మరోవైపు ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూడు రాజధానుల అంశం సరైంది కాదని అన్నారు. దీనిపై స్టడీ చెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే చంద్రబాబు వ్యూహం కూడా కరెక్ట్ కాదని అన్నారు.

చంద్రబాబు చెబుతున్నట్టు లక్షకోట్లు ఒకేచోట కేంద్రీకరించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి కాగలిగే అవకాశం తప్పకుండా వైజాగ్ కు ఉందని అన్నారు. కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక్కటే పెట్టడానికి విశాఖ కరెస్ట్ కాదన్నారు. శాసనసభ, కార్యనిర్వహణ కేంద్రం ఒకేచోట ఉంటె బెటరని సూచించారు. అమరావతిలో అన్ని వేల ఎకరాలు సేకరించడం కూడా తప్పని అన్నారు. అమరావతిలో లక్షకోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినా జనాలు రాకుండా ఉంటే వృధా అని అన్నారు. అంతేకాదు అమరావతి మహానగరం కావాలంటే వందేళ్లు పడుతుందని చెప్పిన కృష్ణారావు.. అన్ని ప్రాంతాలకు అనువుగా ఉండే చోట రాజధానిని నిర్మించాలని సలహా ఇచ్చారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories