Kadapa: ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు

Kadapa: ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
x
టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
Highlights

ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం, దాడులకు దిగారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు.

కడప: ప్రజాస్వామ్యానికి చీకటి రోజు ఇది. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన టీడీపీ అభ్యర్థులపై అధికార పార్టీ నాయకులు దౌర్జన్యం, దాడులకు దిగారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పరిషత్‌ నామినేషన్లకు చివరి రోజు కావడంతో టీడీపీ అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు జడ్పీ, మండల కేంద్రాలకు వెళ్లారు. వారిని వైసీపీ నాయకులు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చింపివేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు.

పోలీసులు గాంధారి పాత్ర పోషించారని ఆరోపించారు. మైదుకూరులో మాజీ సర్పంచ్‌ వెంకటసుబ్బమ్మపై దాడి చేశారని, చిన్నమండెం మండలంలో టీడీపీ అభ్యర్థుల నామినేషన్‌ పత్రాలను వైసీపి నాయకులు చింపివేశారని ఆరోపించారు. వైసీపీకి ప్రజాబలం ఉంటే స్థానిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను బరిలో ఉండేలా చేసి ప్రజాబలం నిరూపించుకోవాలన్నారు. 50 ఏళ్లలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories