రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?

రూ. 150 కోట్లు ముట్టిన ఆంధ్రా ప్రముఖుడెవరు?
x
Highlights

బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల...

బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు తీసుకున్న వాళ్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖుడొకరికి రూ. 150 కోట్లు ముట్టజెప్పారంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వెల్లడించడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారం కాంట్రాక్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆ పారిశ్రామికవేత్త ఎవరా అని ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చర్చనీయాంశయం అయింది. బోగస్‌ బిల్లులు, హవాలా లావాదేవీలతో సంబంధం ఉన్న సదరు ప్రముఖ వ్యక్తి ఏపీ ప్రభుత్వంలో (2014–2019) కీలకపాత్ర పోషించినట్లు ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ సంబంధిత ప్రాజెక్టుల పనుల పేరుతో బోగస్‌ బిల్లులు పెట్టి భారీగా డబ్బు దోచేసిన వారివివరాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని కేంద్ర అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటికే పనులు పూర్తి చేసి బిల్లులు చేసుకున్న కాంట్రాక్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. వారిలో కొంతమంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలతో లాబీయింగ్ నడుపుతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై వారం పదిరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories