ISRO: మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో

ISRO: మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోన్న ఇస్రో
x
Photo from Isro/Twitter
Highlights

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతోంది.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమవుతోంది. PSLV రాకెట్‌ ప్రయోగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో... అదే స్ఫూర్తితో ఇప్పుడు GSLV సిరీస్‌పై ఫోకస్‌ పెట్టింది. శ్రీహరికోట నుంచి మార్చి 5న GSLV-F10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. రాకెట్‌ ప్రయోగానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ షార్‌లో చకచకా జరిగిపోతున్నాయి.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. PSLV రాకెట్ల ప్రయోగాల్లో ఎదురులేని శక్తిగా ఎదిగిన ఇస్రో... అదే స్ఫూర్తితో ఇప్పుడు GSLV సిరీస్‌పై దృష్టి పెట్టింది. అత్యంత బరువైన ఉపగ్రహాలను రోదసిలోకి మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన GSLV అంతరిక్ష వాహక నౌకల రూపకల్పనలో... స్వీయ పరిజ్ఞానాన్ని సాధించిన ఇస్రో ఇప్పుడు ఆ ప్రయోగాలపై గురిపెట్టింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మార్చి 5న GSLV-F10 వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే GSLV వాహక నౌక అనుసంధానం ప్రక్రియ పూర్తికావచ్చింది. ఇక ఉపగ్రహాన్ని అనుసంధానం చేయాల్సి ఉంది. ఈ ప్రయోగం ద్వారా 2వేల 300 కిలోల బరువున్న గీశాట్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఇంధనం నింపే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇస్రో ఛైర్మన్ డాక్టర్ శివన్... షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ల పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు.

GSLV-F10 ప్రయోగం కారణంగా మరో ప్రయోగం వాయిదాపడే అవకాశం కనిపిస్తోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 18న PSLV-C49 రాకెట్‌ను ప్రయోగించాలనుకున్నారు. ప్రస్తుతం GSLV-F10పై దృష్టిపెట్టినందున, ఏప్రిల్ మొదటివారంలో PSLV-C49 ప్రయోగం చేపట్టాలని ఇస్రో భావిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories