పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ప్రారంభించిన ఇస్రో

పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం ప్రారంభించిన ఇస్రో
x
Highlights

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం "యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం" యువ విజ్ఞాని కార్యక్రమం పేరుతో 2019 లో ప్రారంభమైన యువికా రెండవ సెషన్ 2020 మే నెలలో జరగనుంది.

కడప: ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) పాఠశాల విద్యార్థుల కోసం "యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం" యువ విజ్ఞాని కార్యక్రమం పేరుతో 2019 లో ప్రారంభమైన యువికా రెండవ సెషన్ 2020 మే నెలలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ,స్పేస్ సైన్స్,స్పేస్ అప్లికేషన్స్ పై అవగాహన కల్పిస్తారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి పూర్తిచేసి ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యువికా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ఇస్రో అధికారులు తుది జాబితా ప్రకటిస్తారు. 9 వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇస్రో వెబ్ సైట్ http://www.isro.gov.in/ లోకి వెళ్లి ఈ నెల 24 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థుల జాబితా మార్చి 2 న ప్రకటిస్తుంది.తర్వాత పూర్తి వివరాలతో కూడిన విద్యార్థి ధ్రువపత్రాలను మార్చి 23 వ తేదీ లోగా అప్ లోడ్ చేయాలి. వీటిని అధికారులు పరిశీలించి మార్చి 30 వ తేదేన జాబితా వెల్లడిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories