మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో

మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
x
Indian Space Research Organisation
Highlights

-పీఎస్‌ఎల్వీ-సీ47కు కౌంట్‌డౌన్ షురూ -ఇవాళ ప్రారంభమైన కౌంట్‌డౌన్‌ -26 గంటలపాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్‌

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగనుంది. రేపు ఉదయం 9.28 గంటలకు దీన్ని నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ 14 ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది..

ఈసారి రాకెట్ ద్వారా ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీంట్లో అమెరికాకు చెందిన 13 కమర్షియల్‌ నానో ఉపగ్రహాలు పంపనున్నారు. గత అనుభవాల దృష్ట్యా విజవంతంగా ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కార్టోశాట్-3ని ఇస్రో రూపొందించింది. కార్టోశాట్-3 జీవిత కాలం ఐదేళ్లు కాగా.. కార్టోశాట్-3 ఉపగ్రహం బరువు 1625 కిలోలు.. ఉపగ్రహం తయారీకి రూ.350కోట్లు ఖర్చు అయ్యింది.

ఇస్రో సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడానికి ఇమేజింగ్‌ వ్యవస్థలున్న కార్టోశాట్‌-3ని ప్రయోగిస్తోంది. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలపై మెరుపుదాడులకు సహకరించిన రిశాట్‌ శ్రేణికి మించిన సామర్థ్యం ఈ ఉపగ్రహాలకు ఉన్నట్లు ఇస్రో తెలిపింది. మూడో తరం ఉపగ్రహంగా భావిస్తున్న కార్టోశాట్‌-3 25 సెం.మీ. హై రిజల్యూషన్‌తో ఫోటోలను తీయగలదు. సైనిక, ఉగ్రవాద స్థావరాలను మరింత స్పష్టంగా చూపగలదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories