విశాఖలో జగన్ మాట్లాడకపోవడానికి కారణం ఇదేనా?

విశాఖలో జగన్ మాట్లాడకపోవడానికి కారణం ఇదేనా?
x
Highlights

శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన తరువాత ఈ ప్రాంతానికి రావడంతో ప్రజలు పెద్దఎత్తున...

శనివారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో పర్యటించారు. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రతిపాదించిన తరువాత ఈ ప్రాంతానికి రావడంతో ప్రజలు పెద్దఎత్తున రోడ్లకు ఇరువైపులా నిలబడి థాంక్యూ సీఎం సర్ అంటూ ప్లకార్డులు పట్టుకుని ఘన స్వాగతం చెప్పారు. దాదాపు 13 వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతిష్టాత్మక విశాఖ ఉత్సవ్ ను ప్రారంభింపజేశారు.. అయితే విశాఖ ఉత్సవ్ ను ప్రారంభించిన జగన్.. ప్రారంభం ఉపన్యాసం ఇవ్వకపోవడం చర్చనీయాంశం అయింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గురించి జగన్ ఏదైనా ప్రకటన చెయ్యవచ్చేమో అని ఆశపడి ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. రాజధాని అంశంపై మాట్లాడకపోయినా కనీసం విశాఖ ఉత్సవ్ గురించి అయినా మాట్లాడతారేమోనని అందరూ అనుకున్నారు.కానీ అదేదీ జరగలేదు.

ఈనెల 27న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జిఎన్ రావు కమిటీ నివేదికపై నిర్ణయం తీసుకోకపోయినా.. రాజధాని తరలింపు కచ్చితంగా ఉంటుందని మంత్రులతో చెప్పారు సీఎం.. అంతేకాదు ఈ విషయాన్నీ ప్రజలతో చర్చించాక ముందుకు వెళదామని సూచించారు. ఆ తరువాత మంత్రి పేర్ని నాని సైతం ఇదే విషయాన్నీ వెల్లడించారు. ఈ క్రమంలో శనివారం విశాఖ పర్యటనకు వెళ్లిన ఆయన ఏమి మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవడానికి కారణం ఏంటో అర్ధం కాక రాజకీయ పార్టీలు తలపట్టుకున్నాయి. ఇందుకు కారణం జగన్ వ్యూహాత్మకమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం అమరావతిలో రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి, అటు రాయలసీమలో సైతం కొందరు రాజకీయ నిరుద్యోగులు.. తమకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కావాలని, లేదంటే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కోరుతున్నారు. ఇది ఎక్కడ చిలికి చిలికి గాలివానలా మారుతుందేమోనని జగన్ ముందుగానే ఊహిస్తున్నట్టుంది. ఒకవైపేమో అమరావతిలో నిరసనలు, మరోవైపు ఇప్పుడిప్పుడే రాయలసీమలో మొదలవుతున్న అసంతృప్తులు మధ్య రాజధానిపై ఎలాంటి ప్రకటన చెయ్యకూడదని జగన్ నిర్ణయించుకున్నట్టుంది. అంతా సద్దుమణిగాక ప్రకటన చెయ్యడం బెటరని భావిస్తున్నట్లుంది. అందులో భాగంగానే విశాఖలో ఏమి మాట్లాడలేదన్న అభిప్రాయం కలుగుతుంది.

ఇదిలావుంటే రాజధాని విషయంలో జగన్ వెనుకడుగు వెయ్యలేదని టీడీపీ నమ్ముతోంది. పులి రెండడుగులు వెనక్కి వేసినంత మాత్రాన బయపడింది అనుకుంటే పొరపాటే.. వెనక్కి తగ్గింది పంజా విసరడానికి.. జగన్ కూడా అదే చేస్తాడని టీడీపీ నేతలు భావిస్తున్నారు. మరి భవిశ్యత్ లో ఏం జరుగుతోందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories