ఉల్లి ధర పెరగటానికి కారణాలివే!

ఉల్లి ధర పెరగటానికి కారణాలివే!
x
Highlights

భారీ వర్షలు కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉల్లిపంట పెద్దఎత్తున దెబ్బతింది. దాంతో ఉల్లి ధర కిలోకు 160-170 రూపాయలకు చేరడంతో.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు...

భారీ వర్షలు కారణంగా ఇతర రాష్ట్రాల్లో ఉల్లిపంట పెద్దఎత్తున దెబ్బతింది. దాంతో ఉల్లి ధర కిలోకు 160-170 రూపాయలకు చేరడంతో.. వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉల్లి ధరలతో చాలా మంది సామాన్య ప్రజలు ఉల్లి లేకుండానే రోజూవారి కూరలను వండుకుంటున్నారు. ఇంకొంతమంది ధరలు పెరిగినప్పటికీ కూడా రోజువారీ ఆహారంలో ఉల్లి తప్పనిసరి కాబట్టి ఉల్లినీ కొంటే జేబులు ఖాళీ అవుతున్నప్పటికీ కూడా కొనక తప్పడం లేదు. ఇక ఏపీ ప్రభుత్వం సబ్సిడీ ధరల రూపంలో కేజీ రూ.25 కే అందిస్తున్నా ఒకరికి ఒక కేజీ మాత్రమే ఇస్తున్నారు. అయితే సబ్సిడీ ధరకు కొనుగోలు చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇతర కుటుంబసభ్యులను పంపుతున్నారు. దీనివలన అందాల్సిన వారికి అందడం లేదు.

వివిధ రకాల వంటలలో ఉల్లిని విస్తృతంగా ఉపయోగిస్తున్నందున రోజువారీ వినియోగానికి ఈ పరిమాణం సరిపోదని అభిప్రాయపడుతున్నారు. పరిమాణం పెంచమని కోరుతున్నారు. వీలైనంత ఎక్కువ ఉల్లిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనా సరఫరా మాత్రం ఆ మేరకు లేదు. దీనికి ప్రధాన కారణం వర్షాలు ఈ ఏడాది అతిగా పడటమే.. వర్షాలు ఎక్కువై ఉల్లి సాగు దారుణంగా పడిపోయిందని వ్యవసాయ రైతులు చెబుతున్నారు. అయితే వచ్చిన దాంట్లో కూడా కొంతమంది దళారులు సిండికేటే అయి ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. అలాంటి వారిపై ప్రభుత్వాలు కూడా చూసీచూడనట్టు ఉంటున్నాయని అంటున్నారు. ఇటువంటి కారణాలతోనే ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయని వ్యాపారాలు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories