వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత?

వైసీపీలో చేరనున్న టీడీపీ కీలక నేత?
x
Highlights

నిన్న(డిసెంబర్ 29) టీడీపీకి రాజీనామా చేసిన ఇరిగెల రామ పుల్లారెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలి నచ్చక టీడీపీకి...

నిన్న(డిసెంబర్ 29) టీడీపీకి రాజీనామా చేసిన ఇరిగెల రామ పుల్లారెడ్డి వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. మంత్రి అఖిలప్రియ వ్యవహార శైలి నచ్చక టీడీపీకి రాజీనామా చేసానని ఆయన చెప్పారు. అయితే నిన్ననే అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన పుల్లారెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

ఇప్పటికే ఆయనతో ఆళ్లగడ్డ వైసీపీ ఇంచార్జ్ గంగుల బిజేంద్రారెడ్డి సమావేశమై పార్టీలోకి రావలసిందిగా చర్చించారు. పుల్లారెడ్డి రాజీనామా చేస్తారనే ఊహాగానాలతో అప్రమత్తమైన టీడీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే పనిలో పడింది. మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి, మంత్రి అచ్చెన్నాయుడు పుల్లారెడ్డితో మాట్లాడినా ఆయన మాత్రం రాజీనామాకే కట్టుబడ్డారు. కాగా రామ పుల్లారెడ్డి కొంతకాలం ఆళ్లగడ్డ టీడీపీ ఇంచార్జ్ గా పనిచేశారు. గంగుల కుటుంబం రాకతో వారికీ ఇంచార్జ్ పదవి కట్టబెట్టింది టీడీపీ. అయితే మారిన రాజకీయ పరిణామాలతో వైసీపీలో ఉన్న భూమా కుటుంబం టీడీపీలో చేరింది. ఇది నచ్చని గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరిపోయారు. ఆ సమయంలోనే పుల్లారెడ్డి కూడా వైసీపీలో చేరతారని అంతా భావించారు. కానీ ఆయన పార్టీ మారలేదు. అయితే ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రికి, పుల్లారెడ్డికి మధ్య రాజకీయ వైరం పెరిగినట్టు నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేస్తునట్టు చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories