బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ పోస్టుకు ఇంటర్వ్యూలు

బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ పోస్టుకు ఇంటర్వ్యూలు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) చైర్‌పర్సన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో ఈరోజు ప్రారంభమయ్యాయి.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్ (AP SCPCR) చైర్‌పర్సన్, సభ్యుల నియామకానికి సంబంధించిన ఇంటర్వ్యూలు అమరావతిలో ఈరోజు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్వ్యూ ప్రక్రియను అధికారికంగా నిర్వహించారు. ఈ నెల 15, 16, 19, 20, 21 తేదీల్లో ఇంటర్వ్యూలు కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ ఇంటర్వ్యూ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

ఇంటర్వ్యూలను మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పారదర్శకత, అర్హతల ఆధారంగా చైర్‌పర్సన్, సభ్యుల ఎంపిక జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఎంపిక ప్రక్రియకు ఏర్పాటైన ఇంటర్వ్యూ కమిటీలో హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వి.ఎస్.బి.జి. పార్థసారథి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సభ్యులుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి, అనుభవం కలిగిన అర్హులైన వ్యక్తిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రక్రియను చేపట్టిందని అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories