తొమ్మిది భారీ ప్రాజెక్టులకు ఆమోదం : మంత్రి మేకపాటి

తొమ్మిది భారీ ప్రాజెక్టులకు ఆమోదం : మంత్రి మేకపాటి
x
Highlights

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు....

రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి త్వరలో భారీ పరిశ్రమలు రాబోతున్నాయని ఆయన వెల్లడించారు. నూతనంగా వచ్చే ప్రాజెక్టుల జాబితాను కొత్త ఏడాదికల్లా ప్రజల ముందు ఉంచేలా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీంతో బుధవారం సచివాలయంలోని మంత్రి గౌతంరెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు ఐటీ, పరిశ్రమలరంగ ప్రగతి పరిశీలించారు. గడిచిన ఐదు నెలల్లో 12 భారీ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు రాగా వీటిలో తొమ్మిదింటిని ఆమోదించినట్టు మంత్రి స్పష్టం చేశారు.

నవంబర్‌ 18న ముఖ్యమంత్రి వద్ద జరిగే సమీక్షలో ఈ ప్రాజెక్టులపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో లాగా ప్రాజెక్టుల పేరుతో ప్రైవేటు సంస్థలకు ఇబ్బడిముబ్బడిగా భూములు కట్టబెట్టమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అలా చేయదని చెప్పారు.తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక రూ. 14,515 కోట్ల విలువైన తొమ్మిది ప్రాజెక్టులు ఉత్పత్తులు ప్రారంభించాయని, వీటి ద్వారా 17,702 మందికి ఉపాధి లభించిందని, మరో 20 పెద్ద ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories