నాకు బతకాలని ఉంది... వాడు బతకనివ్వట్లేదు!.. ఇంటర్‌ విద్యార్థిని లేఖ

నాకు బతకాలని ఉంది... వాడు బతకనివ్వట్లేదు!.. ఇంటర్‌ విద్యార్థిని లేఖ
x
Highlights

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరిపోడులో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఓ యువకుడి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు... చనిపోయే ముందు తల్లికి యువతి రాసిన లేఖ లభించినట్లు పోలీసులు వెల్లడించారు. వేధింపులకు పాల్పడిన ఆ యువకుడు ఎవరనేదీ తెలియరాలేదు.

అమ్మా నేను ఏ తప్పూ చేయలేదు.. నాకు బతకాలని ఉంది.. కానీ వాడు బతకనివ్వట్లేదు.. తన గదికి రావాలంటున్నాడు... రాకపోతే నా ఫొటోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు.. ఈ విషయం నీ ముఖంలోకి చూసి చెప్పే ధైర్యం నాకు లేదమ్మా.. ఆ యువకుడిని ఏమీ చేయవద్దు.. ఆ ఫొటోలు బయట పెట్టకపోవడం ద్వారానే నా ఆత్మకుశాంతి... ఐలవ్‌యూ అమ్మా.. ఐ మిస్‌యూ అమ్మా.. అంటూ... యువతి ఆత్మహత్య చేసుకునే ముందు తన తల్లికి లేఖ రాసింది.నాకు బతకాలని ఉంది... వాడు బతకనివ్వట్లేదు!


అయితే ఈ ఘటనపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు మహిళా సంఘాల వారు కోరుతున్నారు.

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరిపోడులో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తనను రూమ్‌కు రమ్మని వేధించాడని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు ఓ నోట్ కూడా రాసింది. ఇందులో ఆ యువకుడి గురించి విద్యార్థిని ప్రస్తావించింది. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories