ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మేధస్సే పెట్టుబడి: నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి

ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మేధస్సే పెట్టుబడి: నర్సీపట్నం ఏఎస్పీ రిశాంత్ రెడ్డి
x
ASP Risanth Reddy
Highlights

ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మీ మేధస్సే పెట్టుబడి అని ఐపిఎస్ అధికారి నర్సిపట్నం ఏ ఎస్పీ అన్నారు.

పాయకరావుపేట: ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మీ మేధస్సే పెట్టుబడి అని ఐపిఎస్ అధికారి నర్సిపట్నం ఏ ఎస్పీ అన్నారు. స్థానిక శ్రీ ప్రకాష్ విద్యాసంస్థలో గురువారం జరిగిన విద్యార్థుల ఉజ్వల సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్ధులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం లో CI విజయ్ కుమార్, SI అట్టాడ విభీషణ రావు తదితరులు అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం ఆంటే కావాలన్నది సాధించుకోవడం అని, అటువంటి విజయాలను సక్రమ మైన మార్గంలో సాధించి తల్లిదండ్రులకు చూపించడం నిజమైన విజయం అని అన్నారు.

ఎటువంటి వ్యాపారానికైనా పెట్టుబడి అవసరమని కానీ ఉన్నత మైన ఉద్యోగాల నందు స్థిరపడాలంటే నీ మేధస్సే నీకు పెట్టుబడి అని ఆయన తెలిపారు. కలలు సాకారం చేసుకోవడానికి, ఉన్నత శిఖరాలు చేరటానికి డబ్బు ఒక్కటే మార్గం కాదని, అక్రమ మైన సంపాదన అనర్ధాలకు దారితీస్తుందని, అందుకే కష్టపడి చదువుకొని లక్ష్య సాధన కు చేరుకోవాలని, క్రమశిక్షణ తో కాలేజీ రోజుల నందు మెలిగితే, కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరితే, జీవితం అంతా ఆనంద దాయకంగా గడపవచ్చని, రోజూ మీరు చేసే పనుల గూర్చి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, భారత దేశం నందు నివసిస్తున్న మనం భారత దేశ అభ్యున్నతికి కృషి చేయాలని, స్వచ్ఛ్ భారత్ అనేది ఒకరికోసమే కాకుండా మన కోసం మనముగా చేపట్టాలని, వారంలో ఒకరోజు సమాజ సేవకు కేటాయించాలని, భారత దేశం ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు అని వారు చూపిన అడుగుజాడలు లో నడవాలని సూచించారు. నిజమైన దేశ భక్తుడు అంటే చట్టాలను గౌరవించి తన పనులు తాను సక్రమంగా చేసుకొనేవాడే అని పేర్కొన్నారు. తల్లిదండ్రులకు తెలియకుండా చేసే ప్రతీ పని మిమ్మల్ని చెడ్డదారిలో నడిపిస్తున్నట్లే నని, వ్యసనాలకు దూరంగా ఉండి మంచి విద్యార్థులుగా మెలగాలని తెలిపారు.


సి.ఐ. కే. విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమ తల్లిదండ్రులకు పుట్టినరోజు బహుమతిగా హెల్మెట్ ఇచ్చి వారి పట్ల తమకున్న ప్రేమను చాటి వారిని ప్రమాదాల బారిన పడకుండా కాపాడాలని తెలిపారు. ఎస్ ఐ విభీషణ రావు మాట్లాడుతూ విజయాలు సాధించిన ప్రతీ ఒక్కరూ ఒక్కరోజులో విజయం సాధించలేదని, కొన్ని సంవత్సారాల నిర్విరామకృషి దాగివుందని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని అయన తెలిపారు.

కార్యక్రమం లో స్పేసేస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇంచార్జి డా.కే.వీర్రాజు, వైస్ ప్రిన్సిపల్ పెనుగొండ సుబ్బారావు సుమారు 2600 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అనుబంధ సంస్థ అయినా స్పేసేస్ డిగ్రీ కళాశాల నందు ద్వితీయ సంవత్సరం చదువుతున్న సఖిలేటి కుసుమ తన తండ్రి పుట్టిన రోజు నాడు హెల్మెట్ బహుకరించింది. ఆ తరువాత కొన్ని రోజులకు జరిగిన ప్రమాదం నుండి హెల్మెట్ ద్వారా సురక్షితంగా తన తండ్రీ బయటపడ్డారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఏ ఎస్పీ కుసుమ ను సభాముఖంగా ప్రత్యేకంగా అభినందించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories