Vizianagaram: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీ.. విద్యార్థుల పట్ల టీచర్ల నిర్లక్ష్యంపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం

Inspection By Principal Secretary Of Education Department In Vizianagaram District
x

Vizianagaram: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తనిఖీ.. విద్యార్థుల పట్ల టీచర్ల నిర్లక్ష్యంపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం 

Highlights

Vizianagaram: విద్యార్థుల పట్ల టీచర్ల నిర్లక్ష్యంపై ప్రిన్సిపల్ సెక్రటరీ ఆగ్రహం

Vizianagaram: విజయనగరం జిల్లాలో విద్యాశాఖ ప్రిన్పిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటించారు. పట్టణంలోని కస్పా స్కూల్‌ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. క్లాస్‌రూమ్ విద్యార్థుల నోట్‌బుక్స్ చెక్ చేశారు. విద్యార్థుల పుస్తకాలను ఉపాధ్యాయులు తనిఖీ చేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 శాతం విద్యార్థులు సరిగ్గా చదవడం లేదంటూ ఉపాధ్యాయులపై మండిపడ్డారు ప్రవీణ్ ప్రకాష్. అనంతరం విద్యార్థులను బయటకు పంపి ఆర్జేడీ, డీఈఓ సమక్షంలో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రయివేట్ స్కూల్స్ కన్నా ఎక్కువ జీతం ఇస్తున్నామని, వాళ్ళకి పోటీ ఇవ్వకపోతే ఎందుకంటూ ఫైర్ అయ్యారు. విద్యార్థుల పట్ల అశ్రద్ధ చూపించిన ఇద్దరు ఉపాధ్యాయులు, డిప్యూటీ డీఈఓ, ఎంఇఓలకు నోటీసులు ఇవ్వాలని ఆర్జేడీని ప్రవీణ్ ప్రకాష్ ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories