Vizianagaram: విజయనగరం కలెక్టరేట్ ఎదుట గిరిజనుల వినూత్న నిరసన

Innovative tribal protest in front of Vijayanagar Collectorate
x

విజయనగరం కలెక్టరేట్ ఎదుట గిరిజనుల వినూత్న నిరసన 

Highlights

Vizianagaram: గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్

Vizianagaram: విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఎదుట గిరిజనులు వినూత్న పద్దతిలో నిరసన తెలిపారు. గంట్వాడ మండలంలోని గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ చిన్న పిల్లల కలిసి వంటిపై ఆకులు కట్టుకుని...చేతిలో విల్లు పట్టుకొని ర్యాలీగా వచ్చిన గిరిజనులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు న్యాయం జరగటం లేదని వాపోయారు. పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే గెడ్డెలు, కాలువలు దాటుకొని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories