కృష్ణా జిల్లాలో 1,077 పాఠశాలల అభివృద్ధి

కృష్ణా జిల్లాలో  1,077 పాఠశాలల అభివృద్ధి
x
Highlights

కృష్ణా జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 1,077 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో జెడ్‌పి, మునిసిపాలిటీలు, మండల పరిషత్‌లు...

కృష్ణా జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 1,077 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలో జెడ్‌పి, మునిసిపాలిటీలు, మండల పరిషత్‌లు నిర్వహిస్తున్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా కృష్ణాజిల్లాలో 1,077 పాఠశాలలను గుర్తించారు అధికారులు.

నాడు నేడు పథకం కింద బాలుర, బాలికల నిష్పత్తి ప్రకారం బిల్డింగ్, మరుగుదొడ్లు, ఫర్నిచర్, బ్లాక్ బోర్డులు, కాంపౌండ్ వాల్, పెయింటింగ్స్ అలాగే నీటి సౌకర్యం కల్పించనుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నాడు- నేడు పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పెనమలూరు మండలం తాడిగడప ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో చాలా లోపాలు ఉన్నట్టు ఆయన గుర్తించారు. ఈ స్కూలు ను నాడు-నేడు పధకంలో చేర్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories