నేడు తిరుమలకి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

నేడు తిరుమలకి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్
x
Highlights

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దంపతులు నేడు తిరుమల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వర్తించే వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు.

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ దంపతులు నేడు తిరుమల పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రపతి పర్యటనలో విధులు నిర్వర్తించే వారికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రపతి రాక సందర్భంగా భద్రతా చర్యలు, వసతి సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌లు రేణిగుంట ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు.

రాష్ట్రపతి రాకసందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరుమల గిరుల వరకు పోలీసు తమ కంట్రోల్‌లోకి తీసుకున్నారు. రేణిగుంట టు తిరుమల నిఘా నీడలోకి తెచ్చారు. ఏమాత్రం లోపాలు లేకుండా పర్యటనకు అవసరమైన చర్యలు చేపట్టారు.దేశ ప్రథమ పౌరుడి పర్యటనలో భాగంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం పది గంటల నుండి 11-45 నిమిషాల వరకు తిరిగి సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.

రాష‌్ట్రపతి రూట్‌ మ్యాపింగ్‌ను సిద్ధం చేశారు. రాష్ట్రపతి కుటుంబం తొలుత తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి పద్మావతీ అతిథి గృహం చేరుకుని, అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్తారు. తిరుమలలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories