టీడీపీ ఎమ్మెల్యే 'గంటా'కు షాక్.. ఆస్తులు వేలం వేస్తున్నట్టు ప్రకటన

టీడీపీ ఎమ్మెల్యే గంటాకు షాక్.. ఆస్తులు వేలం వేస్తున్నట్టు ప్రకటన
x
Highlights

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు షాక్ తగిలింది. ఆయన ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు వేలానికి సంబంధించి ప్రకటన...

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు షాక్ తగిలింది. ఆయన ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంకు రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు వేలానికి సంబంధించి ప్రకటన చేసింది ఇండియన్ బ్యాంకు. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యుష కంపెనీ ఇండియన్ బ్యాంకు దగ్గర రూ. 142 కోట్ల రూపాయల ఋణం తీసుకుంది. ఇది వడ్డీతో కలిపి రూ. 221 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను వేలం వెయ్యాలని బ్యాంకు అధికారులు నిర్ణయించారు.

ఏప్రిల్ 16న గంటా ఆస్తులను ఆన్ లైన్ లో ఈ- వేలం వేయనున్నట్లు ఇండియన్ బ్యాంకు పేర్కొంది. వేలంలో ఆస్తులు కొనాలనుకునేవారు ఇవాల్టినుంచి 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. గంటా తోపాటు ప్రత్యూష సంస్థకు చెందిన ఏడుగురు డైరెక్టర్ల ఆస్తులు వేలం వేస్తున్నట్లు ఇండియన్ బ్యాంక్ ప్రకటించింది. కాగా గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజవర్గంనుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు గంటా శ్రీనివాసరావు. గత కొంత కాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories