మరో సర్వే జోస్యం.. ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా..

మరో సర్వే జోస్యం.. ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా..
x
Highlights

ఎన్నికల ముందు వరుస సర్వేలు చేస్తున్నాయి వివిధ సంస్థలు. అందులో 'ఇండియాటుడే' పలుమార్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో సర్వే నిర్వహించింది. తాజాగా మరోసారి ఈ...

ఎన్నికల ముందు వరుస సర్వేలు చేస్తున్నాయి వివిధ సంస్థలు. అందులో 'ఇండియాటుడే' పలుమార్లు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో సర్వే నిర్వహించింది. తాజాగా మరోసారి ఈ సంస్థ సర్వే నిర్వహించింది. అందులో వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి కానున్నారని ఆ సంస్థ జోస్యం చెప్పింది. ఇండియా టుడేలో ప్రసారమయ్యే 'పొలిటికల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజి' (పీఎస్‌ఈ) కార్యక్రమం ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మారుతున్న పరిణామాలు, తాజా రాజకీయ పరిస్థితులు, ఓటర్ల మనోగతంపై ఇది ఎప్పటికపుడు విడతలవారీగా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది ఈ సంస్థ.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సర్వే నిర్వహించినట్టు సంస్థ ప్రసారం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రాలో 'మీ ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటున్నారు?' అన్న ప్రశ్నకు 45 శాతం మంది వైఎస్‌ జగన్‌వైపు మొగ్గు చూపారని. 36 శాతం మంది నారా చంద్రబాబునాయుడు సీఎంగా కొనసాగాలని కోరుకున్నట్టు ప్రసారం చేసింది. అలాగే గత సెప్టెంబర్‌తో పోలిస్తే వైఎస్‌ జగన్‌కు మద్దతిస్తున్న వారు 2 శాతం పెరిగారని, సీఎం చంద్రబాబుకు 2 శాతం తగ్గారని పేర్కొంది. ఇక ఇతరులు 14 నుంచి 15 సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు ఆ సంస్థ పేర్కొంది. ఇక దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఫేక్ సర్వేలు చేయించుకోవడం మామూలే అని వైసీపీని విమర్శిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories