ఉల్లి ధర పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: మాజీ మంత్రి దేవినేని

ఉల్లి ధర పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: మాజీ మంత్రి దేవినేని
x
దేవినేని ఉమామహేశ్వరరావు
Highlights

ఉల్లి ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీళ్లు ఇచ్చే కిలో ఉల్లి కోసం రోజంతా లైన్లో నిలబడాలా..?

రెడ్డిగూడెం : ఉల్లి ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీళ్లు ఇచ్చే కిలో ఉల్లి కోసం రోజంతా లైన్లో నిలబడాలా ..? అని దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం రాత్రి మిట్టగూడెంలో జరిగిన రెడ్డిగూడెం మండల తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్ని.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, పౌరసరఫరాల శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ఉల్లికోసం క్యూలో నిలబడి నూనె సాంబయ్య రెడ్డి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోవటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతకు ఇది నిరద్శనమన్నారు. గత 30, 40 రోజుల నుంచి సమస్య ఉన్నా సీఎం జగన్‌ ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు.

దేశమంతా ఉల్లి సమస్య ఉందని ప్రభుత్వం చెప్పటం అబద్దమని ఆయన ఆక్షేపించారు. ఇసుక, సిమెంట్, ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నిత్యావ సరాల ధరలు పెరిగాయని, ఇప్పుడు ఆర్టీసీ చార్జీలు పెంచారంటూ ప్రభుత్వ విధానాలపై దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. మండల తెదేపా సంస్థాగత ఎన్నిక లను దృష్టిలో పెట్టుకుని సమర్ధవంతంగా కమిటీల నిర్వహణ పూర్తి చేసుకోవాలని, ఏ పార్టీకి లేని కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని అన్నారు.

వైసీపీ నాయకులు ఎన్ని దౌర్జన్యాలు చేసినా కార్యకర్తలు అలాగే ఉన్నారని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఎక్కడ పేరు వస్తుందోనని అమరావతి, పోలవరం పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఎదుర్కొనే విధంగా కమిటీలు ఉండాలని కార్యకర్తలకు సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories