Andhra Pradesh: గుంటూరు, పల్నాడు జిల్లాలో సీఎం జగన్ టూర్..!

* సీఎం పర్యటన నేపథ్యంలో గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు

R Tripura Malini
Published on: 11 Nov 2022 7:02 AM IST
inauguration of global spices processing facilities unit at yadlapadu by ap cm
X

గుంటూరు, పల్నాడు జిల్లాలో సీఎం జగన్ టూర్

YS Jagan: సీఎం జగన్ ఇవాళ పల్నాడు, గుంటూరు జిల్లాలలో సీఎం జగన్ సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 9గంటలకు తాడేపల్లి సిఎం నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ బయలదేరి 9గంటల25 నిమిషాలకు వంకాయలపాడుకు చేరుకుంటారు. తొలిత పల్నాడు జిల్లా యడ్లపాడు మండలంలోని సుగంధ ద్రవ్యాల పార్క్‌లో ఐటీసీ సంస్ధ ఏర్పాటు చేసిన గ్లోబల్‌ స్పైసెస్‌ ప్రాసెసింగ్‌ ఫెసిలిటీ యూనిట్‌ ప్రారంభోత్సవం చేస్తారు. ఆతర్వాత 11గంటలకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవంలో పాల్గొననున్నారు. ఇక 12.30 గంటలకు గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ ఏర్పాటు చేసిన 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ పైలాన్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సిఎం పర్యటన నేపథ్యంలో గుంటూరులో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మూడెంచెలభద్రత ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరింపజేశారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story