TTD: టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు.. శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం

Important Decisions In TTD Board Meeting Decision To Release White Paper On Srivani Funds
x

TTD: టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు.. శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయం 

Highlights

TTD: వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారు -పాలకమండలి

TTD: టీటీడీ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీవాణి నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది. దుష్ప్రచారం చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. కొందరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని. శ్రీవాణి ట్రస్టుతో పాటు ఇతర ఏ ట్రస్టుల్లో అవినీతి జరగలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అనుమానం ఉంటే ఎవరైనా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. శ్రీవాణి ట్రస్టుకు ప్రత్యేక బ్యాంకు అకౌంట్ ఉందని. అందులోనే విరాళాలు జమ అవుతాయన్నారు. టీటీడీ నుంచి ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టే అవకాశమే లేదని తెలిపారు. కొందరు కావాలనే పదేపదే ఆరోపణలు చేయడం సోచనీయమని వ్యాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories