YCP: వైసీపీలో కీలక మార్పులు.. ఆ ఆరుగురికి.. నో టికెట్

Important Changes In YCP At The Time Of Election
x

YCP: వైసీపీలో కీలక మార్పులు.. ఆ ఆరుగురికి.. నో టికెట్

Highlights

YCP: ఈ రోజు రాత్రి లేదా రేపు సిట్టింగ్‌ల మార్పు ప్రకటన ఉండే ఛాన్స్

YCP: ఎన్నికలకు టైం దగ్గర పడుతుండటంతో.. వైసీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికపై దృ‌ష్టి పెట్టిన సీఎం జగన్..పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలను మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే 11స్థానాలకు కొత్త ఇంఛార్జులను ప్రకటించిన జగన్.. తాజాగా ఉమ్మడి గోదావరి జిల్లాలో 6 గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ నిరాకరించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ 6స్థానాల్లో ఇంఛార్జులను మార్చుతున్నట్టు సమాచారం. జగ్గంపేట, పిఠాపురం, పత్తిపాడు, పి.గన్నవరం.

పోలవరం, చింతలపూడి ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం సీఎం జగన్‌తో ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పర్వత ప్రసాద్, పెండం దొరబాబు భేటీ కానున్నారు. రేపు తాడేపల్లి రావాలని మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు పిలుపువచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ రోజు రాత్రి లేదా రేపు సిట్టింగ్‌ల మార్పు ప్రకటన ఉండే ఛాన్స్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories